24 గంటల్లో నిరూపించాలి … బండి సంజయ్ కు రోహిత్ రెడ్డి సవాల్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. కర్ణాటక డ్రగ్స్ కేసులో పోలీసులు తనకు నోటీసులు ఇచ్చినట్టు చేసిన ఆరోపణలను నిరూపించాలని అన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా, రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తా అన్నారు. డగ్స్ కేసుతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపించాలన్నారు. ఈ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు, ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ కు 24 గంటల సమయం ఇస్తున్నా అన్నారు. నిరూపించలేకపోతే తప్పయ్యిందని బండి సంజయ్ ఒప్పుకోవాలన్నారు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వారి ఆగడాలను ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్ టార్గెట్ టానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు.













