మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదు : ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన నేషనల్ డ్వామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) కమిటీతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అధికారులు సమావేశమయ్యారు. ఎన్‌డీఎస్‌ఏ కమిటీకి పూర్తిగా సహకరిస్తామని, ప్రాథమిక నివేదిక వీలైనంత త్వరగా ఇవ్వాలని కమిటీని మంత్రి ఉత్తమ్ కోరారు. నివేదిక ఆధారంగా మరమ్మతులతో పాటు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మోదీ విధానాల వల్లే దేశంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోంది. కాళేశ్వరం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారటానికి మోదీ విధానాలే కారణం. కార్పొరేషన్ల ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.84 వేల కోట్ల రుణం తీసుకుంది. మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదు అని అన్నారు.