మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
గాంధీభవన్‌కు సమాంతరంగా మరో ఆఫీస్ నడుస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ వ్యవహారశైలితో విసిగిపోయా అని అన్నారు. డబ్బులతో పీసీసీ కొన్నారన్న కోమటిరెడ్డి వాదనను నమ్ముతున్నట్లు తెలిపారు. తాము హోమ్‌గార్డుల్లాగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు. దాసోజు శ్రవణ్, రాజగోపాల్ రెడ్డి చెప్పినవి నిజాలని స్పష్టం చేశారు. ముగ్గురు కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై అలా మాట్లాడడం సరికాదని అన్నారు.













