రేపు మహాకూటమి అభ్యర్థుల ప్రకటన
ఎన్నికల్లో టీఆర్ఎస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మీడియాతో మాట్లాడుతూ షెడ్యూల్ రాక ముందే టీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ అక్రమాస్తుల వివరాలను ప్రజల ముందుంచుతామన్నారు. కూటమిలోని అసంతృప్తి నేతలను, టీఆర్ఎస్ వైపు తిప్పుకుంటామని కేసీఆర్ చెప్పటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ సమాజాన్ని చెడగొట్టడానికి బీట్ బ్యాచ్ తయారైందని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారుప. కూటమి గెలుపు కోసం తాను, రావుల చంద్రశేఖర్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నామని సృష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను ఆస్పత్రిగా మార్చుతామన్నారు. గత అనుభవంతో అభ్యర్థుల ప్రకటనపై ఆచితూచి వ్యవహరిస్తున్నామని అన్నారు. రేపు సాయంత్రానికి సీట్ల సర్థబాటుపై సృష్టత వస్తుందని, రేపు ఒకే వేదికపై కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.













