తెలంగాణలో జూట్ పరిశ్రమలు : మంత్రి కేటీఆర్
వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్లోస్టర్, ఎంజీబీ, కాళేశ్వరం అగ్రో మిల్లుల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. జూట్ మిల్లుల ఏర్పాటుతో 10,400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటీ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని వెల్లడిరచారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి పెట్టాలని సూచించారు.
ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి జూట్ ఉత్పత్తులు ఉపయోగపడతాయని తెలిపారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు జూట్ మిల్లులు లేవన్నారు. జూట్ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే 20 ఏండ్లలో సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా జూట్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. మొదటి విడతలో భాగంగా జూట్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందని అన్నారు. రాష్ట్రంలో పదివేల ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడిరచారు. భవిష్యత్లో జూట్ పరిశ్రమకు రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.













