బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్
తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను తిడితే ఓట్లు రాలవు. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా అని బండి సంజయ్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మా కంటె రెండు మంచి పనులు ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకోవండి. పొద్దున లేస్తే బూతులు మాట్లాడటం తప్పా ఆయనకు ఏం తెల్వదు. వీళ్వు ఇచ్చిన తర్వాతే దేవుడికి మొక్కుడు నేర్పించినట్లు వ్యవరిస్తున్నారు. బండి సంజయ్ నిజంగా రాజన్న భక్తుడు అయితే వేములవాడకు రూ.100 కోట్లు ఎందుకు తేలేకపోతున్నాడు. మోదీ దగ్గర పలుకుబడి లేదా. అడగడానికి నోరు రాదా అని ప్రశ్నించారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి, కొండగట్టు అంజన్న ఆలయానికి, జోగులాంబ ఆలయానికి, భద్రాద్రి రాముడికి, యాదాద్రికి నిధుల తీసుకురా అని సంజయ్కు సవాల్ విసిరారు.













