పేద ప్రజలకు ఇది ఓ వరం : కేటీఆర్
తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్ పేదప్రజలకు ఓ వరం అని మంత్రి కేటీఆర్ అన్నారు. నారాయణగూడ ఐపీఎం క్యాంపస్‌లో హబ్‌ను మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వైద్య వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించా. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 40-50 శాతం పెరిగింది. పట్టణంలోని పేదవారి కోసం బస్తీ దవాఖానాలు ప్రారంభించా. ప్రస్తుతం 17 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయి. మనదేశంలో వైద్య వ్వవస్థ చాలా ఖర్చుతో కూడుకున్నది. సామాన్యులకు పైసా ఖర్చుకాకుండా తెలంగాణ డయాగ్నోస్టిక్‌లో ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు. డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా అన్ని రకాల పరీక్షల రిపోర్టులు 24 గంటల్లో వచ్చేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో 3 షిఫ్ట్‌ల్లో సిబ్బంది సేవలు అందిస్తారని తెలిపారు.













