తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ముందు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ వద్దకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య సంభాషణ జరిగింది. హుజురాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించారు. పిలిస్తే కదా హాజరయేయది అంటూ ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగా లేదని కేటీఆర్‌కు ఈ సందర్భంగా ఈటల హితవు పలికారు. వారి మధ్య సంభాషణ జరుగుతుండగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడికి వెళ్లారు. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన ప్రస్తావించారు. మళ్లీ ఈటల కలుగజేసుకుని కనీసం కలెక్టర్ నుంచైనా ఆహ్వానం ఉండాలన్నారు. ఆయన వ్యాఖ్యలకు కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు.













