కొడంగల్ లో గెలవని రేవంత్.. కామారెడ్డిలో గెలుస్తారా?
కొడంగల్‌లో నరేందర్ రెడ్డిపై ఓడిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై గెలుస్తారా అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మాచారెడ్డిలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కొడంగల్‌లో గెలవని రేవంత్ రెడ్డి, కామారెడ్డిలో గెలుస్తారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న రేవంత్ డిపాజిట్‌ను కామారెడ్డి ప్రజలు గల్లంతు చేస్తారని తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల సమస్యలు కేసీఆర్ పరిష్కరించారు. గజ్వేల్ మాదిరిగానే కామారెడ్డిలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక అధికారిని నియమించి కామారెడ్డి ప్రజల సమస్యలన్నీ పరిష్కారిస్తాం. కేసీఆర్ నియోజకవర్గం కామారెడ్డిలో దశాబ్దాలుగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి అని అన్నారు.













