డ్రగ్స్ కేసులో క్లీన్‌గా వస్తే ఏం చేస్తావ్.. బండికి కేటీఆర్ సవాల్
కేటీఆర్ డ్రగ్స్‌కు అడిక్ట్ అయిపోయారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పలుమార్లు ఆరోపించారు. తాజాగా వీటిపై కేటీఆర్ స్పందించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఆఖరికి కేసీఆర్‌కు కూడా సంబంధం ఉందని బండిసంజయ్ ఆరోపిస్తున్నారని కేటీఆర్ అన్నారు. డ్రగ్స్ టెస్ట్‌కు తాను సిద్ధమని, ఈ పరీక్షలో తాను క్లీన్ చిట్‌తో బయటకు వస్తానని అప్పుడు నువ్వు ఏం చేస్తావ్ అంటూ బండిసంజయ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ‘‘నేను ఈ కేసులో క్లీన్‌గా బయటకు వస్తే నాపై ఆరోపణలు చేసిన వాళ్లు కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటారా? నా చెప్పుతో కొడతానంటే కించపరిచే వ్యాఖ్యలు అంటూ పిచ్చి కూతలు కూస్తారు, కాబట్టి ఆయన చెప్పుతో ఆయన్నే కొట్టుకోమని చెబుతున్నా’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘‘పరీక్ష కోసం నా చర్మం తీసుకుంటారో, రక్తం తీసుకుంటారో తీసుకోండి. నా నిజాయితీ, చిత్తశుద్దిని నిరూపించుకుంటా. అప్పుడు చెప్పు దెబ్బలకు అతడు సిద్ధం కావాలి. అందుకు రెడీ అంటే నేను ఇక్కడే ఉంటా ఏ డాక్టర్నైనా తెచ్చుకోవచ్చు. ఏం కావాలన్నా ఇస్తా. రక్తం, చర్మం, గోళ్లు ఆఖరికి కిడ్నీ కూడా ఇస్తా.. ఏం రాజకీయం అయ్యా ఇది. కరీంనగర్‌కు ఏం చేశావని అడిగితే. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా గావుకేకలు, పిచ్చి అరుపులు, విచిత్ర ఆరోపణలు, అబద్దాలు చెప్పడం తప్ప ఇంకేంలేదు’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.













