టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్‌గా కృష్ణారెడ్డి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తాత్కాలిక చైర్మన్‌గా డి.కృష్ణారెడ్డి నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పూర్తి స్థాయి చైర్మన్‌ను నియమించేవరకు ఈ పదవిలో ఈయన ఉండనున్నారు. కృష్ణారెడ్డి ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటివరకు కమిషన్ చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం తాత్కాలిక చైర్మన్‌ను నియమించింది. ఘంటా చక్రపాణి, పలువురు కమిషన్ సభ్యుల పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయ్యారు.













