మెడికల్ హబ్‌గా తెలంగాణ : భారత్ బయోటెక్ చైర్మన్
తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారిందని భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ ఎల్ల కృష్ణ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ బయోటెక్ పలు వ్యాధులకు వ్యాక్సిన్లు తెచ్చిందని అన్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికి రాష్ట్రంలో అన్ని వసతులు ఉన్నాయన్నారు. ఇతరుల కంటే ముందుగా వ్యాక్సిన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనేక దేశాలకు సరైన సమయంలో కరోనా వ్యాక్సిన్లు ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి అన్ని దేశాలకూ ఔషధాలు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు కావాల్సిన దాన్ని గ్రహించి వెంటనే మార్కెట్లోకి తేవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలకు సహకరిస్తున్నాయి. ప్రపంచం మొత్తానికి ఆహారం అందించే శక్తి భారత్‌కు ఉందన్నారు. మన వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నారు.













