ఈ విషయంలో అమెరికా, ఐరోపా కంటే ముందంజలో ఉన్నాం
ముక్కు ద్వారా తీసుకునే కొవిడ్ వ్యాక్సిన్‌పై మేము పని చేస్తుండగా అమెరికాకు లేని ఈ వ్యాక్సిన్ భారత్‌కు ఎలా సాధ్యం అనే ప్రశ్నలు వచ్చాయి. ఈ విషయంలో అమెరికా, ఐరోపా కంటే ముందంజలో ఉన్నాం అని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్ల అన్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో నిర్వహించిన ఐఐటీ హైదరాబాద్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. అందుబాటులోకి వచ్చిన నాసల్ వ్యాక్సిన్‌తో ఎగువ శ్వాసకోశ వ్యవస్థలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనాను కట్టడి చేస్తుందని తెలిపారు. ఇంజక్షన్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్లు ఊపిరితిత్తుల కింద భాగం నుంచే పనిచేస్తాయి. ముక్కు, నోటీ ద్వారా లోపలికి ప్రవేశించే వైరస్ ను అక్కడికక్కడే కట్టడి చేసే శక్తి నాసల్ టీకాను ఉంటుంది అని వివరించారు.













