బీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ?
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. వీరు దాదాపు గంటపాటు సమావేశం అయ్యారు. కాగా జూలై 1వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. గత ఏడాది కాలంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ చేరడంపై విశ్వేశ్వర్‌రెడ్డికి ఉన్న సందేహాలను బీజేపీ నేతలు నివృతి చేసి, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడించినట్లు తెలుస్తోంది. 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి 2018లో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కిందటి ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతా రెడ్డి.. కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య.













