రాహుల్ గాంధీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ
టీఆర్ఎస్ను వీడిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి ఢిల్లీలో రాహుల్‌గాంధీ నివాసాని వెళ్లారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ భేటీలో వివరించారు. అనంతరం కుంతియాతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను వ్యక్తిగత కారణాలతో టీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని సృష్టం చేశారు. టీఆర్ఎస్ సిద్ధాంతాల్లో వచ్చిన మార్పుల కారణంగానే పార్టీ నుంచి వైదొలిగానని చెప్పారు. నియోజకవర్గ సమస్యల గురించి తాను రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు. ఎంఎంటీఎస్, వికారాబాద్ శాటిలైట్ సిటీ తదితర సమస్యల గురించి వివరించినట్లు చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో టీఆర్ఎస్కు రాజీనామా చేశానని సృష్టం చేశారు. కాంగ్రెస్ అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ అని, ప్రాంతీయ పార్టీలతో సమస్యలు పరిష్కారం సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. 23న మేడ్చల్ సభలో సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కుంతియా తెలిపారు.













