ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…
తెలంగాణలో ప్రస్తుతం ఒరిజినల్ కాంగ్రెస్ లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్లో ప్రయారిటీ లేదని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదువుల ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో అసలైన ఉద్యమకారులు లేరని వ్యాఖ్యలు చేశారు. చప్పట్లు వచ్చినంత ఈజీగా ఓట్లు రాలవని అన్నారు. సినిమా డైలాగులకు ఓట్లు రావని స్పష్టం చేశారు. భట్టి తనతో ప్రత్యేకంగా మాట్లేందుకు వచ్చారని ఆయనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. భట్టి తాను అన్నదమ్ముల్లాగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్కు తానెక్కడ దూరం అవుతానేమోనన్న ఆవేదనతో భట్టి వచ్చారని తెలిపారు.
12 మంది ఎమ్మెల్యేలు పోయినా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది నిజం. బీజేపీ బలపడుతోందని నేను పలుమార్లు చెప్పాను. చెప్పిందే నిజమైంది. ఈటలకు బీజేపీ తోడైంది. అందుకే గెలిచారు. నేను కన్ఫ్యూజ్ కాలేదు. క్లారిటీతో చెప్పా. బీజేపీ, టీఆర్ఎస్ను ఓడిస్తుందని నమ్ముతన్నా. మునుగోడుకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి వందసార్లు వెళ్లినా ఒక్కటే, నేను ఒక్కసారి వెళ్లినా ఒక్కటే. కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఇచ్చేందుకు మంత్రి వెళ్లాల్సిన అవసరముందా అని ప్రశ్నించారు.













