కోదండరాం సంచలన నిర్ణయం
జనగామ బరి నుంచి తప్పుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. బీసీలకు అన్యాయం జరగకూడదనే కోదండరాం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. జనగామ నుంచి కోదండరాం పోటీ చేస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్యయ్య పేరు లేకపోడడంతో రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో టీజేఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగాం నుంచి కోదండరాం పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీసీలకు అన్యాయం చేయడం తమకు ఇష్టం లేదు కాబట్టి, కోదండరాం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలియవచ్చింది. అయితే కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది తేలియడం లేదు.













