నిజాం షుగర్ తెరిచిన తర్వాతే.. విశాఖ ఉక్కు
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచిన తర్వాతనే కేసీఆర్ కుటుంబం విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని టీఆర్ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిందన్నారు. ఏడేళ్ళుగా షుగర్ పరిశ్రమను ఎందుకు తెరవలేదో చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కేటీఆర్‌కు పూనకం వస్తోందని విమర్శించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవటానికి కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు. 70 శాతం ఫిట్మెంట్ ఇస్తామన్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఆర్ఎస్కు ఓటు వేయరన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలే బైంసా ఘటనకు కారణమన్నారు. బైంసా ఘటనకు టీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. త్వరలో బైంసాలో పర్యటిస్తామని తెలిపారు.













