గుణాత్మకమైన పరిపాలన అంటే.. కుటుంబ పాలనా?
గుణాత్మకమైన పరిపాలన అంటే కుటుంబ పాలనా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం బీజేపీ అంటే భయపడుతున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబీకుల మాటలు, తీర్మానాలు అబూత కల్పనలే అని విమర్శించారు. దేశాన్ని ఉద్దరించేంది టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబమే అని మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో 8 ఏళ్లుగా టీఆర్ఎస్ ఏం ఉద్దరించిందో చెప్పాలని? అని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, గుణాత్మక మార్పు అని కేసీఆర్ మాట్లాడారని తెలిపారు. పుల్వామా సర్జికల్ స్ట్రైక్‌కి ఆధారాలు కోరిన వ్యక్తి దేశ సమగ్రత గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.













