రెండో రాజధాని చేసే ఆలోచన కేంద్రానికి లేదు
హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేసే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి మూడు రాజధానుల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని అన్నారు. రాజధాని తరలింపుపై సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. నరేంద్రమోదీది సంస్కరణల ప్రభుత్వమని కొనియాడారు. ఈ నెలలో జమ్మూలో కేంద్రమంత్రులు పర్యటిస్తారని, త్వరలో జమ్మూకశ్మీర్‌లో ఇన్వెస్టర్ల సమావేశం జరుగుతుందన్నారు. సీఏఏ బిల్లు వల్ల ఏ ఒక్కరు ఇబ్బంది పడినా.. బిల్లును మార్చడానికి వెనుకాడమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.













