కిషన్ రెడ్డికి కేంద్రం ఏ శాఖ ఇచ్చిందంటే
కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి శాఖ కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. సికింద్రబాద్ నుంచి 62 వేల పైచిలుకు మెజార్టీతో కిషన్‌రెడ్డి విజయం సాధించారు. 2004, 2009, 2014లో వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. కిషన్‌రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి రావడంతో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













