ఇచ్చిన మాట పూర్తి చేయకుండా ఓట్లు అడిగే హక్కు లేదు.. కిషన్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదు అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన 44వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకు బతుకుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పతనం తెలంగాణలో ప్రారంభమైపోయింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆశలకు ఊపిరి పోయగలిగేది కేవలం బీజేపీ మాత్రమే అని పేర్కొన్న ఆయన లోక్‌సభ ఎన్నికల్లో మోదీకే ఓటు వేయాలని జనాలు నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోలు విడుదల చేస్తున్న కాంగ్రెస్ ముందు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి చేస్తే బాగుంటుంది అని ఆయన అన్నారు.