ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా ఇదే
తెలుగు రాష్ట్రాలో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణేశ్ 2022 విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎడమవైపున శ్రీ తిశక్తి మహా గాయత్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రమ్మణ్య స్వామి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక 50 అడుగుల ఎత్తులో నిర్మించనున్న ఈ విగ్రహాన్ని మట్టితో మాత్రమే రూపొందించనున్నారు. ఖైరతాబాద్ గణేషుడిని మట్టితో రూపొందించడం ఇదే తొలిసారి. జూన్ 10న తేదీన కర్రపూజతో విగ్రహ తయారీ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విహ్రాలను వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.













