సీఎం కేసీఆర్ నామినేషన్ కు ముహుర్తం ఖరారు
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నామినేషన్ దాఖలుకు ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. గజ్వేల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తన నామినేషన్‌ను గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో సమర్పించనున్నట్టు తెలుస్తున్నది. మంచి మూహూర్తం ఉండటంతో ఆ సమయంలో నామినేషన్ వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నామినేషన్ దాఖలు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌లో భారీ బహిరంగసభను నిర్వహించనున్నట్టు, సభకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే పురమాయించినట్టు తెలుస్తున్నది.













