బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు : కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలి. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ కోసం దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని రకాల ఏర్పాటు చేయాలి అని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. నేటి నుంచి 9 రోజుల పాటు ఊరూవాడా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తారు.













