మునుగోడును మరో అమెరికా చేస్తా : కేఏ పాల్
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలతో సమానంగా మునుగోడు ప్రజలకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వరాలు పలుకుతున్నారు. దీపావళి పండుగ రోజున మునుగోడులో పర్యటించి ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడును మరో అమెరికా చేస్తానని ఇప్పటికే ఓటర్లకు హామీ ఇచ్చిన పాల్ ఇప్పుడు మునుగోడు ప్రజలపై వరాలు జల్లు కురిపిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేవని, తాను మాత్రమే చేయగలనని అన్నారు. 60 నెలల్లో ఇతర పార్టీలు చేయలేని మునుగోడును ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రతి మండలంలో కళాశాల, ఆరు నెలల్లో ఉచిత ఆసుపత్రి నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.













