మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూపల్లి
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సచివాలయంలోని నాలుగో అంతస్తులో మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎమ్మెల్యేలు యొన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్, కూచుకుళ్ల రాజేశ్వర్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్‌తో పాటు అధికారులు నిఖిల, మామిడి హరికృష్ణ తదితరులు మంత్రిని కలిశారు. అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు సుపరిపాలన అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.













