రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ గా స్నేహజ జొన్నలగడ్డ
హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్పీఓ)గా 2016 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ బాధ్యతలు స్వీకరించారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేసిన స్నేహజ స్వస్థలం హైదరాబాద్. అంతకుముందు స్నేహజ బీజింగ్‌లో ఇండియన్ ఎంబసీ సెకండ్ సెక్రెటరీగా పనిచేశారు. విదేశీ వ్యవహారాల శాఖలో విజిలెన్స్ విభాగంలో, బంగ్లాదేశ్, మయన్మార్ డివిజన్లో అండర్ సెక్రెటరీగా కూడా విధులు నిర్వర్తించారు. ఆర్పీఓగా విధులు నిర్వర్తించిన దాసరి బాలయ్య ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఆయన కేంద్ర రెవెన్యూ విభాగంలో అదనపు కమిషనర్‌గా వెళ్లనున్నారు.













