తెలంగాణలో జనసేన పోటీపై త్వరలో నిర్ణయం
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రెండుమూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ముందస్తు ఎన్నికలు రావడం, సన్నద్ధత లేకపోవడంపై పోటీపై సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. ముందస్తు కాకుండా వచ్చే ఏడాది ఎన్నికలు వస్తే 23 స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా అనుకున్నామని, అలాగే మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావించామని పేర్కొన్నారు. ముందస్తుకు వెళ్లడంతో తమ పార్టీ పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొందని వివరించారు. అయితే కొంత మంది స్వతంత్రంగా నిలబడతామని, తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారని చెప్పారు. వీటన్నింటీపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సృష్టం చేశారు.













