అమెరికా నివేదికలో మునివాహన సేవ
మునివాహన సేవలో భాగంగా చిలుకూరి ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ ఒక దళితుడిని భుజాలకెత్తుకుని ఆలయంలోకి తీసుకెళ్లిన ఘటనను అమెరికా జాతీయ కమిషన్ ఒకటి తన నివేదికలో ప్రస్తావించింది. 2016 ఏప్రిల్ 16న హైదరాబాద్ జియాగూడలోని రంగనాథస్వామి ఆలయలో ఆయన మునివాహన సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలీజియస్ ఫ్రీడమ్ 2019 వార్షిక నివేదికలో కమిషన్ అధ్యక్షుడు టెన్జిన్ దోర్జీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ స్వామివారి ఆశీర్వాదంతోనే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టే భాగ్యం తనకు కలిగిందని.. అందుకు ఎంతో ఆనందిస్తున్నానని రంగరాజన్ అన్నారు.













