దేశంలోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్
అంతర్జాతీయ సూచికలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత 10 ఏండ్లుగా స్థిరమైన పాలన, ప్రశాంత రాజకీయ వాతావరణం ఫలితంగా హైదరాబాద్ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్ తాజా నివేదిక (2023) కుండబద్దలు కొట్టింది. మెర్సర్స్ వరల్డ్‌వైడ్ క్యాలిటీ ఆఫ్ లివింగ్ (జీవన నాణ్యత) తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి హైదరాబాద్‌కు అత్యుత్తమ ర్యాంక్ దక్కింది. బెంగళూరు, పుణే వంటి నగరాలను భాగ్యనగరం వెనక్కి నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ 153వ స్థానంలో నిలువగా, పుణెకు 154, బెంగళూరుకు 156 ర్యాంకులు దక్కాయి. చెన్నై( 161), ముంబై (164), కోల్‌కతా (170), న్యూఢిల్లీ (172) నగరాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో విదేశీ ఉద్యోగులు, ప్రవాసులు, వారి కుటుంబాల రోజువారీ జీవనం వాస్తవ పరిస్థితుల ఆధారంగా మెర్సన్స్ ఈ ర్యాంకుల్ని విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత దేశానికి చెందిన 7 నగరాలు మాత్రమే చోటు దక్కించుకోగా, అందులో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవటం విశేషం.













