తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
తెలంగాణలో కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి మే ఒకటో తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి ఫార్మసీలు, ల్యాబ్‌లు, మీడియా, పెట్రోల్ బంక్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. టికెట్ కలిగిన విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు అని ప్రకటించింది. అంతర్ రాష్ట్ర సర్వీసులు, రాష్ట్ర సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు ఉండవు అని తెలిపింది.













