నేను ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నా
తాను ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సృష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేయలేదని ఆయన తేల్చి చెప్పారు. రాజీనామా చేసినట్లు కొన్ని ఛానళ్లలో వచ్చిన వార్తలను కృష్ణయ్య ఖండించారు. ఈసారి జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్లీ ఎల్బినగర్ నుంచే పోటీ చేయాలన్న ఒత్తిడి ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తల నుంచి వస్తుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నా దృష్ణా, ఇంకా సృష్టమైన నిర్ణయం తీసుకోలేదని అన్నారు.













