హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. వచ్చే నెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు హెచ్ఐసీసీలో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశం తో పాటు అంతర్జాతీయ దేశాలకు చెందిన మూడు వేల మంది డెలిగేట్స్ హాజరు కానున్నట్లు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ అండ్ కో చైర్మన్ సీ శేఖర్ రెడ్డి తెలిపారు. వీరిలో 80 మంది ప్రముఖ వ్యక్తులు కాగా, 20 మంది అంతర్జాతీయ స్పీకర్లు తమ అనుభవాలను పంచుకోనున్నట్లు తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి 20వ ఎడిషన్‌గా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు, హైదరాబాద్‌లో జరగడం ఇది మూడో సారని పేర్కొన్నారు. ఈ సదస్సుకు బిల్డర్లు, డెవలపర్లు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, ప్లానర్లు, కన్సల్టెంట్లు, కార్పొరేట్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.













