గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా గణేశుడు
ఖైరతాబాద్ బడా గణేశుడు (Khairatabad Bada Ganesh) గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ (NTR Marg)లోని క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది 69 అడుగుల పంచముఖ సంకటహార మహాగణపతిగా గణనాథుడు దర్శనమిచ్చాడు. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. సెన్సేషన్ థియేటర్ (Sensation Theatre), రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి (Telangana Thalli ) చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఈ శోభయాత్ర కొనసాగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మార్గ్ వద్ద చేరుకున్న బడా గణేశుడికి ఉత్సవ కమిటీ (Festival Committee) ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు హుస్సేన్‌సాగర్ లో భారీ క్రేన్ల సాయంతో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేశారు.








