క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసుకోండి : మంత్రి లోకేష్
టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతాతో మంత్రి లోకేష్ భేటీ
అహ్మదాబాద్ (గుజరాత్): ఫార్మాస్యూటికల్స్, పవర్, గ్యాస్, ఎలక్ట్రికల్ రంగాల్లో పేరెన్నికగన్న టోరెంట్ (Torrent) గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా, డైరక్టర్ షాన్ మెహతా, హోల్ టైమ్ డైరక్టర్ జిగీష్ మెహతాలతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కోసం టోరెంట్ వైజాగ్ ప్లాంట్ ఏపీఐలు, అధునాతన ఇంటర్మీడియట్‌లపై దృష్టి సారించిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ఫార్మా క్లస్టర్లలో ఏపీఐ తయారీ, ఇంటర్మీడియట్ సామర్థ్యాలను విస్తరించే అవకాశాలను అన్వేషించండి. కంపెనీ తన రెన్యువబుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించాలనే ప్రణాళికల దృష్ట్యా, ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరఫరా చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన, హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్టుల అవకాశాలను పరిశీలించండి. ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మాలిక్యూల్స్లోకి టోరెంట్ పవర్ ప్రకటించిన విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా, పంప్డ్-స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, సంబంధిత క్లీన్-ఎనర్జీ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ను ఎంపికచేసుకోండి. టోరెంట్ తమ పెట్టుబడి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను విశ్వసించినందుకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. టోరెంట్ చైర్మన్ సమీర్ మెహతా మాట్లాడుతూ… తమ సంస్థ హై పొటెన్షీ ఉత్పత్తుల కోసం తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. టోరెంట్ పవర్ 3.96 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, 3గిగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజి సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తూ.. గ్రీన్ హైడ్రోజన్, ఇతర క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అన్వేషిస్తోంది. 2030 నాటికి 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యానికి చేరుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.








