భారీగా ధర పలికిన బాలాపూర్ లడ్డు
హైదరాబాద్‌లోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం. ఈసారి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.39 లక్షల ఆల్‌టైమ్ హై ధరకు అమ్ముడుపోయింది. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్‌రెడ్డి లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాది 35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు.








