ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రతిష్టించిన చోటే వినాయక నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ వినాయక విగ్రహాన్ని ట్యాంక్ బండ్ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తూ వచ్చారు. అయితే వినాయక నిమజ్జనానికి హైకోర్టు అనుమతి నిరాకరించింది. హుస్సేన్‌సాగర్ కాలుష్యంగా మారుతోందని, అందులో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆదేశించింది. ఈ ఒక్క ఏడాది వరకు పివోపి విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జీహెచ్ఎంసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.













