కొత్త వైరస్ తో తెలంగాణ అప్రమత్తం
యూకేలో కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆర్టిపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ప్రయాణీకులను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తుండగా.. నెగిటివ్ వచ్చిన వారిని వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని నిర్ణయించారు. ఈ నెల లండన్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వచ్చిన ప్రయాణీకుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 2300 మంది ప్రయాణీకులు వచ్చినట్లు గుర్తించారు.













