ప్రజల ప్రాణాలతో చెలగాటమా? తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
అటు పెరగుతున్న కేసులు, ఇటు విపక్షాల విమర్శల నేపధ్యంలో ఉక్కిరి బిక్కిరవుతున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ద్వారా మరోసారి అక్షింతలు పడ్డాయి.
గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కరోనా పరీక్షల విషయంలో తప్పు బట్టిన హైకోర్టు మరోసారి బుధవారం ప్రభుత్వంపై ఆగ్రహం వెలిబుచ్చింది. ప్రజల జీవించే హక్కును కాలరాసేలా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.య తాము ఆదేశించినప్పటికీ పరీక్షలు చేపట్టకపోవడం కోర్టు థిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. గత 20 రోజులుగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? కేంద్ర బృందం పర్యటన తదితర వివరాలు తమకు తెలపాలని ఆధేశించింది. ఈ నెల 17 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని లేదా సిఎస్‌తో పాటు సంబంధిత అధికారులు కూడా న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సిందేనంటూ స్పష్టం చేసింది.













