తెలంగాణలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం
తెలంగాణలో బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై హైకోర్టు నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని బ్యాన్ చేసింది. దీపావళి సందర్భంగా బాణాసంచాను నిషేధించాలని న్యాయవాది ఇంద్ర ప్రకాశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కరోనా పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషన్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు, పలు హైకోర్టులు రాష్ట్రాలు నిషేధం విధించాయని కోర్టుకు తెలిపారు. అయితే బాణాసంచాపై నిర్దిష్ట పాలసీ రూపొందించలేదని, ఎన్టీసీ మార్గదర్శకాలు పాటిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బాణాసంచాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇలాగే ఇప్పటి వరకు తెరిచిన దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది.













