ఆగస్టు 13 నుంచి హజ్ యాత్ర
పవిత్ర హజ్ యాత్రకు ఎంపికైన వారిని ఆగస్టు 13 నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక విమానంలో పంపడానికి తెలంగాణ హజ్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈయేడు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 2900 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారు. సుమారు 350 మందితో వెయింటింగ్ జాబితా రూపొందించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్నాటక రాష్ట్రం నుంచి ఎంపికైన హజ్ యాత్రికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 17 నుంచి 22వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, కర్నాటక ప్రాంతాలకు చెందిన యాత్రికులు వెళ్లడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు.













