తెలంగాణకు గుడ్ న్యూస్
గతంలో కరోనా పాజిటివ్ వచ్చిన 11 మంది కరోనా రోగులు నెగిటివ్‌గా తేలిందనీ, ఇది తెలంగాణకు గుడ్ న్యూస్ అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ అంశాన్ని ఆయన ట్విటర్లో పంచుకున్నారు. తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తూ వైరస్‌ను నివారించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే వైరస్ సోకిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో 11 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వీరందరికీ గతంలో పాజిటివ్ అని తేలాగా.. తాజా నమూనాల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. ఇటీవల వీరందరికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు.













