ఉస్మానియా యూనివర్సిటీలో సంబురాలు….
ఉస్మానియా యూనివర్సిటీలో సంబురాలు మిన్నంటాయి. త్వరలో జరుగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌ను విద్యార్థి ఉద్యమ కారుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఉస్మానియా యూనివర్సిటీలో సంబురాలు మిన్నంటాయి.. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్టస్ కళాశాల ఆవరణలో విద్యార్థులంతా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని నృత్యాలు చేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నేతలు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్న గెల్లు శ్రీనివాస్‌ను గుర్తించి అవకాశం కల్పించడం గొప్ప విషయమని అన్నారు. కేసీఆర్ చూసి మిగిలిన పార్టీల నాయకులు నేర్చుకోవాలని హితవు పలికారు.













