కుంతియా ఔట్… ఆజాద్ ఇన్?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. దీనితో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను తొలగించి, పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను నియమించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పరిణమిస్తోంది. మరోవైపు ఆజాద్ రాకతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.













