GHMC: త్వరలోనే గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను (జీహెచ్ఎంసీ) మూడు కార్పొరేషన్లుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ( ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 150 డివిజన్లతో ఒక కార్పొరేషన్ (Corporation) చేయడంతో పాటు, మున్సిపాలిటీలు (Municipalities), కార్పొరేషన్లతో మరో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బల్దియా పాలక మండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి (February)లో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 10 తర్వాత ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ (Notification) విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ విస్తరణ, వార్డుల డీలిమిటేషన్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. వార్డుల విభజనపై దాఖలైన 80కి పైగా పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వార్డుల డీలిమిటేషన్‌పై జోక్యం చేసుకోమంటూ న్యాయస్థానం వాఖ్యానించింది. దీంతో డీలిమిటేషన్ ప్రక్రియకు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు.






