GHMC: జీహెచ్ఎంసీ కమిషనర్ మరో కీలక నిర్ణయం
జీహెచ్ఎంసీ (GHMC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేస్తున్న 60 మంది డిప్యూటీ ఇంజినీర్లను బదిలీలు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (RV Karnan) ఉత్తర్వులు జారీ చేశారు. నగర విస్తరణ నేపథ్యంలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని భావించారు. ఈ క్రమంలోనే బదిలీలకు జీహెచ్ఎంసీ కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇటీవల అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని 27 మున్సిపాలిటీల (Municipality)ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధి గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో నగర జనాభా, నివాస ప్రాంతాలు, చెత్త ఉత్పత్తి పరిమాణం కూడా పెరిగాయి. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిపాలనా నిర్మాణంలో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్‌ను 12 జోన్లు, 60 సర్కిల్స్‌గా పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రతి సర్కిల్లో చెత్త సేకరణ, శానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా ప్రత్యేక బాధ్యతలు కలిగిన డిప్యూటీ ఇంజినీర్లను నియమించారు. ఈ నేపథ్యంలోనే 60 మంది డీఈలకు వివిధ సర్కిల్స్‌కు బదిలీలు జరిగాయి.






