హుజూరాబాద్ లో నైతిక విజయం నాదే
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్పందించారు. హుజూరాబాద్‌లో నైతిక విజయం తనదే అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేసిన ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. నా గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విద్యార్థి నాయకుడు వెంకట్‌ని బలిపశువును చేశాయని గెల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.













