హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ?
త్వరలో ఎన్నికలు జరుగనున్న హుజురాబాద్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ అభ్యర్థినే బరిలో దింపాలని డిసైడ్ అయినట్లు సమాచారం. సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తర్వాతే అభ్యర్థిని కన్ఫామ్ చేసినట్లు టాక్. పోటీ చేయడానికి చాలామంది బరిలో ఉన్న.. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌కే టికెట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. గెల్లు శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన స్వర్గం రవి, జమ్మికుంట స్థానిక లీడర్ వీరేశం, వకుళాభరణం కృష్ణమోహన్ పేర్లు పరిశీలించారు. చివరకు గెల్లు శ్రీనివాస్ కే టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













