వైఎస్ఆర్టీపీ తీర్థం పుచ్చుకున్న గట్టు రామచంద్రరావు
మాజీ టీఆర్ఎస్ నేత, బీసీ నాయకుడు గట్టు రామచంద్రరావు వైఎస్ఆర్టీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత్రి షర్మిల నేతృత్వంలో గట్టు రామచంద్రరావు పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావన్నారు. టీఆర్ఎస్కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయమని తేల్చి చెప్పారు. షర్మిల చేస్తున్న పోరాటం బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదన్నారు. తెలంగాణ వైఎస్ఆర్ లెగసీ ఎక్కడకు పోలేదని తెలిపారు. వైఎస్ఆర్కి జిరాక్స్ కాపిలా షర్మిల కనిపిస్తోందని తెలిపారు. షర్మిల పార్టీలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు.
బండి సంజయ్‌ను రాజకీయంగా కేసీఆర్ ఎందుకు హైలెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీతో దోస్తీ కోసమే కేసీఆర్ తపన పడుతున్నారని విమర్శించారు. అందుకే తెలంగాణలో బీజేపీ కేసీఆర్ హైలెట్ చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ కేసీఆర్ కలిసి పని చేస్తారని అన్నారు.













